మరో వివాదంలో అనిల్ యాదవ్

నెల్లూరు ముచ్చట్లు:

 

నెల్లూరులో కొత్త వివాదం మొదలైంది. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్ల వివాదం పొలిటికల్‌ కలర్‌ పులుముకుంటోంది. ఈ పొలిటికల్‌ లేఔట్స్‌ వివాదం మాజీ మంత్రి అనిల్‌ యాదవ్‌ టార్గెట్‌గా సాగుతోంది. ఆయనగా మంత్రిగా ఉన్న మూడేళ్ల కాలంలో లేఔట్స్‌ మంజూరులో 3వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపించారు. తన సహచరుడు, మాజీ కార్పొరేటర్‌ కిన్నెర ప్రసాద్‌ అనే వ్యక్తి ద్వారా అనిల్‌ అక్రమ లేఔట్స్‌ వేయిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ వెంచర్లలో అనిల్‌ బినామీగా ఉన్నారని టీడీపీ అంటోంది. ఈ అక్రమ వ్యవహారాల ద్వారా ఖజానాకు 200 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని టీడీపీ నేతలు ఫిర్యాదు చేసారు. అక్రమ లేఔట్స్ వ్యవహారంలో లోకేశ్‌ ట్వీట్‌ చేసిన వెంటనే నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ వైస్‌ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. తాజాగా నెల్లూరు శివారు ఎన్టీఆర్‌ నగర్‌లో వేస్తున్న లేఔట్‌ వివాదాస్పదమవుతోంది. నుడా వైస్‌ ఛైర్మన్‌ను కలిసిన మాజీ నుడాఛైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కలిసి అనిల్‌ యాదవ్‌పై ఫిర్యాదు చేశారు.లోకేశ్‌ ట్వీట్‌పై మాజీ మంత్రి అనిల్‌ యాదవ్‌ తీవ్రస్థాయిలో స్పందించారు. టీడీపీ నేతలు చాలా మంది తమతో టచ్‌లో ఉన్నారని, ముందు ఆ విషయం తెలుసుకో అని సవాల్‌ విసిరి, రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారానికి పొలిటికల్‌ కలర్‌ పూశారు. లోకేశ్‌పై అనిల్‌ చేసిన ఆరోపణలపై నెల్లూరు టీడీపీ నేతలు భగ్గుమన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు అవినీతి ఆరోపణలపై సాక్ష్యాధారులు సమర్పిస్తే ఏం చేశావని నిలదీశారు.అనిల్‌ వ్యాఖ్యలకు టీడీపీ కూడా అదే స్థాయిలో స్పందించింది. నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ తమ పార్టీతో టచ్‌లో ఉన్నారని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు ట్వీట్‌ చేశారు. రోజు నీతో మాట్లాడే ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నారని కూడా కాల్వ ట్వీట్‌ చేశారు. దమ్ముంటే ఆ ఎమెల్యేలను సీఎంతో చెప్పి సస్పెండ్‌ చేయించమని అనిల్‌కు సవాల్‌ విసిరారు.

 

Tags: Anil Yadav in another controversy

Post Midle
Post Midle
Natyam ad