Animators should be taken immediately

యానిమేటర్లను వెంటనే తీసుకోవాలి

Date:08/11/2019

హైదరాబాద్ ముచ్చట్లు:

ఏపీలో వెలుగు యానిమేటర్లను జగన్ సర్కార్ అన్యాయంగా ఉద్యోగాల్లో నుంచి తొలగించిందని ఆరోపిస్తోంది టీడీపీ. ఎన్నికల సమయంలో న్యాయం చేస్తామని చెప్పిన జగన్.. ఇప్పుడు ఏకపక్షంగా వారిని ఉద్యోగాల నుంచి తొలగించారని చెబుతోంది. అన్యాయంగా యానిమేటర్లను రోడ్లపై పడేశారని.. తిరిగి వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. తాజాగా ఈ వ్యవహారంపై మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు.‘4 లక్షల మంది వైకాపా కార్యకర్తలకు ఉద్యోగాలివ్వడం కోసం,10 లక్షల మంది ఉద్యోగుల పై వేటు వేసారు జగన్ గారు. పాదయాత్రలో అక్కా, చెల్లీ మీ జీతం పదివేలు చేస్తా అన్న జగన్ గారు ఒకే ఒక్క సంతకంతో 27,700 మంది వెలుగు యనిమేటర్లని రోడ్ల పైకి నెట్టేసి, వారి జీవితాల్లో వెలుగు లేకుండా చేశారు’అన్నారు.‘మహిళల్ని వేధించిన పాపం ఊరికే పోదు జగన్ గారు. ఒక్క ఉద్యోగం కూడా తియ్యడానికి వీలు లేదు. వెలుగు యనిమేటర్లకి అండగా మేము ప్రత్యక్ష పోరాటం మొదలు పెడతాం. మీరు ఇచ్చిన ఉత్తర్వులు తక్షణమే వెనక్కి తీసుకోవాలి. 27,700 యనిమేటర్లని తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకోవాలి’అని డిమాండ్ చేశారు. నాడు-నేడు పేరుతో ఓ వీడియోను ట్వీట్ చేశారు లోకేష్.

 

బంధువే మహిళపై అఘాయిత్యం

 

Tags:Animators should be taken immediately

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *