శ్రీ కోదండరామాలయంలో ఘనంగా ఆణివార ఆస్థానం
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి శ్రీ కోదండరామాలయంలో ఆదివారం సాయంత్రం ఆణివార ఆస్థానం ఘనంగా జరిగింది. ఆలయంలోని గరుడాళ్వార్ ఎదురుగా శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండరాములవారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి ప్రత్యేకంగా ఆస్థానం నిర్వహించారు.ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో దీనికి ఆణివార ఆస్థానం అని పేరు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం రోజు నుండి టీటీడీ ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి.ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో దుర్గరాజు, ఆలయ ప్రధాన అర్చకులు ఆనంద్‌కుమార్ దీక్షితులు, సూపరింటెండెంట్ రమేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags: Anivara Asthanam in Sri Kodandaramalayam