శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో పుష్పయాగానికి అంకురార్పణ

తిరుపతి ముచ్చట్లు:

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూన్ 14వ తేదీన జరగనున్న పుష్పయాగానికి జూన్ 13వ తేదీ సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు అంకురార్పణ నిర్వహిస్తారు.ఇందులో భాగంగా జూన్ 14న ఉదయం 9.30 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవింద రాజ స్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్ల‌తో అభిషేకం చేస్తారు.మధ్యాహ్నం 1 నుండి 4 గంటల వరకు పుష్పయాగం వైభవంగా జరుగనుంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు.టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 

 

 

Tags:Ankurarpana for Puspa Yaga at Sri Govindaraja Swamy Temple

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *