శాస్త్రోక్తంగా శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ

తిరుపతి ముచ్చట్లు:

 

తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో జూలై 24 నుండి 26వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాలకు శ‌నివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.ఇందులో భాగంగా సాయంత్రం 6 గంటల నుండి సేనాధిపతి ఉత్సవం, మేధిని పూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణ ఘట్టాలు నిర్వహించారు . యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తుంటారు.పవిత్రోత్సవాల్లో భాగంగా జూలై 24వ తేదీ యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం, జూలై 25న పవిత్ర సమర్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. జూలై 26న యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ‌ డెప్యూటీ ఈవో   నాగ‌ర‌త్న‌, ఏఈవో   దుర్గ‌రాజు, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు   ఆనంద‌కుమార్ దీక్షితులు, సూపరింటెండెంట్‌   ర‌మేష్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

Tags: Ankurarpana for the consecration of Sri Kodandaramaswamy in science

Leave A Reply

Your email address will not be published.