అన్నా రాంబాబు దూకుడే శాపమా

Date:20/01/2021

ఒంగోలు ముచ్చట్లు:

సైలెంట్ గా ఉండే ఎమ్మెల్యే ఒక్కసారిగా స్పీడయ్యారు.తనకు నచ్చని పనిచేసిన వారిపై నోరు పారేసుకుంటున్నారు. గతంలో సైలెంట్‌గా రాజకీయం నడిపిన ఆయన ఇప్పుడు రూటు మార్చి టాప్‌ గేర్‌లో వెళ్తుండటంతో నియోజకవర్గ ప్రజలతో పాటు ప్రత్యర్ధులు సైతం షాక్ కి గురవుతున్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యల వివాదం ప్రత్యర్ది పార్టీ కార్యకర్త మరణానికి కారణమవ్వడంతో ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే పై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తుంది.ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వీడియోలు గత కొద్ది రోజులుగా నియోజకవర్గంలో చక్కర్లు కొడుతున్నాయి. రాంబాబేనా ఇలా మాట్లాడింది అని గిద్దలూరులో చర్చ జరుగుతోంది. అందుకే ఎవరైనా తనకు నచ్చని పని చేస్తే ఓ రేంజ్‌లో విరుచుకు పడుతున్నారట. ఈ విషయంలో ప్రభుత్వ ఉద్యోగైనా.. ప్రత్యర్థి పార్టీ కార్యకర్త అయినా ఈక్వెల్‌గా ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారు. పబ్లిక్‌లోనే బూతులు తిట్టేస్తున్నారు. ఇలాంటి వీడియోలు.. ఆడియోలు ఇప్పుడు గిద్దలూరులో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. ఇవి కాస్తా వీడియోలు.. ఆడియోల రూపంలో సోషల్‌ మీడియాకు ఎక్కడం.. రచ్చ రచ్చ కావడం కామనైపోయింది.2009లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి పీఆర్పీ ఎమ్మెల్యేగా గెలిచిన అన్నారాంబాబు అంతకు ముందు కాంట్రాక్టర్‌ గా పని చేశారు. . ఆ తర్వాత కాంగ్రెస్‌, టీడీపీ తిరిగి 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు రాంబాబు. ఆ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ పదిహేనేళ్ల రాజకీయ జీవితంలో రాంబాబు చాలా సైలెంట్‌ అన్న ముద్ర పడింది. అలాంటిది కోపం వస్తే ఏదో పూనకం వచ్చినట్టుగా ఊగిపోతున్నారట. పనులు చేయలేదని ప్రభుత్వ ఉద్యోగులపై చిర్రుబుర్రులాడటం.. విపక్ష పార్టీ కార్యకర్తలపై విరుచుకుపడటానికి వెనకాడటం లేదట ఎమ్మెల్యే.

 

 

అన్నా రాంబాబు కాన్సెప్ట్‌ ఏదైనా.. బూతులు తిట్టిన వీడియోలు మాత్రం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. రెండు నెలల క్రితం కంభం మండలం ఎర్రబాలెం VRO కాశీం వలీపై శివాలెత్తారు ఎమ్మెల్యే. ఈ ఘటనపై చర్చ జరుగుతుండగానే బేస్తవారిపేట మండలం సింగన్నపల్లిలో తన కారుకు ఎదురెళ్లిన జనసేన కార్యకర్త చంద్రశేఖర్‌ విషయంలోనూ అదేవిధంగా నోటికి పని చెప్పారు. వార్నింగ్‌లు ఇచ్చారు. ఈ వీడియో సైతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఎమ్మెల్యే దూషణలకు మనస్తాపం చెందిన జనసేన కార్యకర్త ఒకరు ఆత్మహత్య చేసుకున్నారని తెలియడంతో ఈ వివాదం రాజకీయంగా కొత్త మలుపుతిరిగింది.సైలెంట్‌గా ఉంటే లాభం లేదని అనుకున్నారో ఏమో.. రాంబాబు సడన్ గా దూకుడు పెంచారని పార్టీ కేడర్‌ చెవులు కొరుక్కుంటోంది. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మళ్లీ శాసనసభ్యుడు అనిపించుకునేందుకు వేచి చూడాల్సి వచ్చింది. చివరకు పార్టీలు మారి లక్‌ను పరీక్షించుకున్నారు. ఇప్పుడా అదృష్టాన్ని శాశ్వతం చేసుకోవాలనే ప్లాన్‌లో భాగంగా ఆయన గేర్‌ మార్చి ఉంటారని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ ఎమ్మెల్యే నోటి దూల మత్రం ఆయనకి శాపంగా మారుతుందని నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది.

ముద్రగడకు రాజ్యసభ ఆఫర్

Tags:Anna Rambabu is an aggressive curse

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *