Natyam ad

నవంబరు 8న శ్రీకపిలేశ్వరాలయంలో అన్నాభిషేకం

– చంద్రగ్ర‌హ‌ణం కార‌ణంగా 11 గంట‌ల పాటు ఆల‌య త‌లుపులు మూత‌

తిరుపతి ముచ్చట్లు:

 

తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 8వ తేదీన కార్తీక పౌర్ణమి పర్వదినాన అన్నాభిషేకం ఘనంగా నిర్వహించనున్నారు. చంద్రగ్ర‌హ‌ణం కార‌ణంగా ఉద‌యం ఉద‌యం 8.30 నుండి రాత్రి 7.30 గంట‌ల వ‌ర‌కు ఆల‌య త‌లుపులు మూసి ఉంచుతారు.ఈ సందర్భంగా ఉదయం 3 నుంచి 3.30 గంటల వరకు ఏకాంతంగా శుద్ధోధక అభిషేకం, ఉద‌యం 3.30 నుంచి 5.30 గంటల వరకు ఏకాంతంగా అన్నాభిషేకం, దీపారాధన చేపడతారు. ఉద‌యం 5.30 నుంచి 7.30 గంటల వరకు భక్తులకు అన్నలింగ దర్శనం కల్పిస్తారు. ఉద‌యం 7.30 నుంచి 8 గంటల వరకు ఏకాంతంగా అన్నలింగ ఉద్వాసన చేపడతారు. శుద్ధి అనంతరం ఉద‌యం 8 నుండి 8.30 గంటల వరకు సుగంధద్రవ్య అభిషేకం ఏకాంతంగా నిర్వహిస్తారు.చంద్రగ్ర‌హ‌ణం కార‌ణంగా ఉద‌యం 8.30 నుండి రాత్రి 7.30 గంట‌ల వ‌ర‌కు ఆల‌య త‌లుపులు మూసి ఉంచుతారు. రాత్రి 7.30 గంట‌ల‌కు ఆల‌య త‌లుపులు తెరిచి 8 గంట‌ల వ‌ర‌కు శుద్ధి చేస్తారు. ఆ తరువాత భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. రాత్రి 8 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు అభిషేకం, రాత్రి 8.30 నుండి 10 గంట‌ల వ‌ర‌కు అలంకారం, స‌హ‌స్ర‌నామార్చ‌న‌, నివేద‌న‌, దీపారాధ‌న‌, రాత్రి 10 నుండి 10.15 గంట‌ల వ‌ర‌కు ఏకాంత సేవ నిర్వ‌హిస్తారు.

 

Post Midle

Tags: Annabhishekam at Srikapileswara Temple on 8th November

Post Midle

Leave A Reply

Your email address will not be published.