ఆనంద నిలయంలో అన్నదానం
రైల్వే కోడూరు ముచ్చట్లు:
శ్రీ చైతన్య కళాశాల జూనియర్ లెక్చరర్ విజయలక్ష్మి అన్నమయ్య జిల్లా. రైల్వేకోడూరు . నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలం రాళ్ల చెరువు పల్లె పెద్ద ఓరంపాడు పాపిరెడ్డి పల్లె మూడు గ్రామాల మధ్య ముచ్చటగా వెలిసిన జీవనజ్యోతి ఆనంద నిలయం లో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు రాజంపేట మండలం పెద్దవరం పల్లె గ్రామానికి చెందిన మన్నూరు మహేష్ భార్య విజయ లక్ష్మివృద్ధులకు విభిన్న ప్రతిభావంతుల కు ఒంటరి లకు రుచికరమైన భోజనం ఏర్పాటు చేయడం జరిగింది తదనంతరం పండ్లు పంపిణీ చేశారు విజయలక్ష్మి తండ్రి డాక్టర్ నందవరం శంకర్ నారాయణ జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వలన ఆరెంజ్ జ్యూస్ దివ్యాంగులకు ఒంటరి లకు వృద్ధులకు ఇవ్వడం జరిగింది అందరికీ భోజనం ఏర్పాట్లు చేసి గొప్ప దయార్థ హృదయం చాటుకున్నారు ఆశ్రమం తరపున విజయలక్ష్మి కుటుంబానికి అన్ని విధాల మంచి జరగాలని ఆశ్రమ నిర్వాహకులు పాణ్యం సుబ్రహ్మణ్యం ఆశ్రమ మేనేజర్ పుల్ల గంటి సిద్ధమ్మ, అదనపు మేనేజర్ అశోక్ వర్ధన్ ,వృద్ధులు దివ్యాంగులు ఒంటరి లు కృతజ్ఞతలు తెలియజేశారు.
Tags: Annadanam at Ananda Nilayam

