Annadanam in old age home

వృద్ధాశ్రమంలో అన్నదానం

Date:28/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని దోబీకాలనీలో గల వృద్దాశ్రమంలో శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దివంగత ఎస్‌ఐ మునివెంకటప్ప వర్ధంతి సందర్భంగా ఆయన భార్య యల్లమ్మ, అల్లుడు రెడ్డెప్ప, కుటుంబ సభ్యులు అనాధలకు భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అలాగే గూడూరుపల్లె జెడ్పీ హైస్కూల్‌లో పదోతరగతి విద్యార్థులకు పెన్నులు, ప్యాడ్లు పంపిణీ చేశారు. మునివెంకటప్ప వర్ధంతి సందర్భంగా ప్రతి సారి పేదలకు రకరకాల సేవలు అందిస్తుండటాన్ని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు రెడ్డి వరప్రసాద్‌, రెడ్డిప్రద, రెడ్డిసుధ, రెడ్డి శిరీష, నారాయణ , వెంకటముని పాల్గొన్నారు.

 పెండింగ్ సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తాం

Tags: Annadanam in old age home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *