Natyam ad

అన్నమయ్య జయంతి వేడుకలు

నంద్యాల ముచ్చట్లు:


నంద్యాల పట్టణంలో సోమవారం నాడు కోదండ రామాలయం లో అన్నమయ్య జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సర్వజీవులలో సర్వాత్మలకు ఆత్మ అయిన శ్రీహరిని చూస్తూ, తత్ఫలితంగా సమస్తాన్నీ ఆ భగవంతుని సంబంధంలోనే చూసేవాడు, సమస్తం ఆ దేవదేవునిలోనే నిత్యవిలసితమై ఉన్నదని ఎరిగి ఉండేవాడే భాగవతోత్తముడు’. ఈ నిర్వచనానికి నిలువెత్తు నిదర్శనం మన భక్త కవితా పితామహుడు అన్నమయ్య.వైశాఖ పూర్ణిమనాడు జన్మించిన అన్నమయ్య 95 సంవత్సరాలు శ్రీవేంకటేశ్వరుని సంగీతమయ ఆరాధనలో తన్మయులై జీవించారు. భగవత్ప్రేరణచే వైష్ణవ సంప్రదాయాన్ని స్వీకరించి ‘పద కవితా పితామహుని’గా ప్రసిద్ధి చెందారు. సుమారు 32,000 కీర్తనలు శ్రీవేంకటేశ్వరుని ప్రీత్యర్థం పాడిన మహోన్నత ధన్యజీవి మన అన్నమయ్య. ఆయన రాసిన‘చందమామ రావో జాబిల్లి రావో’ పాటను ప్రతీ ఇంట శాశ్వతంగా ప్రేమతో తల్లులు పాడుకుంటారు.

 

Tags:Annamayya Jayanti celebrations

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.