Natyam ad

నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఆక‌ట్టుకున్న‌ అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు

తిరుమ‌ల ముచ్చట్లు:

తిరుమ‌ల శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా శుక్ర‌వారం సాయంత్రం నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌ముఖ సంగీత విద్వాంసులు శ్రీ రాణి శ్రీ‌నివాస‌శ‌ర్మ బృందం ఆలపించిన అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు భక్తిభావాన్ని పంచాయి.శ్రీ రాణి శ్రీ‌నివాస‌శ‌ర్మ‌ నేతృత్వంలో “అన్నమయ్య సంకీర్తన సుమమాలిక” పేరుతో అన్నమయ్య సంకీర్తనలను స్వరపరిచి రికార్డు చేశారు. ప్రస్తుతం మ‌రికొంద‌రు కళాకారులతో క‌లిసి ఈ సంకీర్తనలను రసరమ్యంగా ఆలపించారు.ఈ కార్య‌క్ర‌మంలో ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ ప్ర‌త్యేకాధికారి డాక్టర్ విభీషణ శర్మ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Annamayya sankirtanas impressed on stage by Nadaneerajanam

Post Midle