Natyam ad

జ‌న ‌బాహుళ్యంలోకి అర్థ తాత్పర్యాలతో అన్నమయ్య సంకీర్త‌న‌లు- టీటీడీ ఈవో  ఏవి.ధర్మారెడ్డి

– అన్నమయ్య సంకీర్తన లహరి గ్రంథం -2 ఆవిష్కరణ

తిరుమల  ముచ్చట్లు:

Post Midle

పద కవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమయ్య సంకీర్తనలను అర్థ తాత్పర్యాలతో ప్రజలందరికీ చేరువ చేసేందుకు టీటీడీ కృషి చేస్తోంద‌ని టీటీడీ ఈవో  ఏవి.ధర్మారెడ్డి పేర్కొన్నారు.  శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 614వ జయంతిని పురస్కరించుకొని తిరుమల అన్నమయ్య భవన్ లో శుక్రవారం  “అన్నమయ్య సంకీర్తన లహరి గ్రంథం -2 ” ఈవో ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీ తాళ్ళపాక అన్నమయ్య శ్రీవారిపై 32 వేలకు పైగా సంకీర్తనలు రచించినట్లు తెలిపారు. అన్నమయ్య  సంకీర్తనలలో ప్రతి సంకీర్తనకు అర్థ తాత్పర్యాలు, ఆ సంకీర్తన ఏ సందర్భంలో రాశారు, మూలం ఏమిటి అనే విశేష అంశాలు తెలిస్తే గాయకులు భావ భావయుక్తంగా ఆలపిస్తారన్నారు.  శ్రీవారి అనుగ్రహంతో 1922 నుంచి 2022 వరకు అంటే దాదాపు వంద సంవత్సరాల తర్వాత స్వామివారి  అనుగ్రహంతో అన్నమయ్య రచించిన సంకీర్తనలకు అర్థ తాత్పర్యాలతో భక్తుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం కలిగిందన్నారు. 16 మంది నిష్ణాతులైన ప్రముఖ పండితులు అన్నమయ్య సంకీర్తనలకు అర్థ తాత్పర్యాలు, విశేష అర్థాలను సమకూర్చారని చెప్పారు.

 

Tags; Annamayya Sankirtanas with meaningful implications for the masses – TTD EO AV Dharma Reddy

Post Midle