నాదనీరాజనం వేదికపై ఆకట్టుకున్న అన్నమయ్య సంకీర్తనలు
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం నాదనీరాజనం వేదికపై ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ప్రముఖ సంగీత దర్శకులు సాలూరి వాసురావు, గాయకులు శ్రీనివాసశర్మ బృందం ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు భక్తులను అలరించాయి.శ్రీ సాలూరి వాసురావు ఆధ్వర్యంలో మమన్ కుమార్ “ఇందులోనే కానవద్దా….., మోహన రాగం, తప్పదు ఈ అర్థము …..షణ్ముఖ ప్రియ రాగం”, ధృతి ” విన్నవించరే….పంతువరాళి రాగం, నీవొక్కడవే సర్వాధారము…..రేవతి రాగం”, సౌమ్య “రామభద్ర రఘువీర…..శుద్ధధన్యాసి రాగం, తెలియక ఊరక….సింధుభైరవి రాగం ” సంకీర్తనలను రసరమ్యంగా ఆలపించారు.గాయకులు శ్రీనివాసశర్మ బృందం ” కొనుట వెగ్గళము దారినుట…..సిన్నవాడవని నమ్మ……అమ్మేటి దొకటియు….ఫాల నేత్రానన….” తదితర సంకీర్తనలను మధురంగా ఆలపించారు.ఈ కార్యక్రమంలో ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి డాక్టర్ విభీషణ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Tags:Annamayya’s Sankirtans Impressed by Nadanirajanam on Stage
