Natyam ad

32 సెంటర్లలో  అన్నపూర్ణ క్యాంటిన్లు

హైదరాబాద్ ముచ్చట్లు:


హైదరాబాద్ నగర ప్రజలకు కేవలం 5 రూపాయలకే ఆహారాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన అన్నపూర్ణ పథకం ఎంతో విజయవంతమైంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆహార పథకం కింద, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోని సాధారణ ప్రజల కోసం అన్నపూర్ణ క్యాంటిన్ ను సరికొత్తగా ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు కేవలం నిల్చునే రూ.5ల భోజనాన్ని తినాల్సి వచ్చేంది. ఇక నుంచి కూర్చుని తినేందుకు వీలుగా కొత్త క్యాంటిన్లను ఏర్పాటు చేయనున్నారు. అంటే చాలా చౌకగా క్యాంటీన్‌లో కూర్చొని ఆహారాన్ని ప్రజలు తినగలుగుతారు. అతి తక్కువ ధరకు స్వచ్ఛమైన ఆహారాన్ని అందించడమే రాష్ట్ర ప్రభుత్వం అన్నపూర్ణ ఆహార పథకాన్ని ప్రారంభించింది. 2014లో ప్రారంభించినప్పటి నుంచి దాదాపు 10 కోట్ల మంది నగరవాసులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు.జీహెచ్‌ఎంసీలోని ఒక్కో సర్కిల్‌లో 32 స్థలాలను గుర్తించామని, ఇక్కడ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని, కేవలం రూ.5కే వినియోగదారులకు ఆహారం, సీటింగ్ ఏర్పాట్లు చేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. ఈ పథకం కింద కేవలం రూ.5 వెచ్చించి అన్ని ప్రాంతాల ప్రజలు 400 గ్రాముల అన్నం, 120 గ్రాముల సాంబారు, 100 గ్రాముల కూరగాయల కూర, 15 గ్రాముల పచ్చిమిర్చి కూర పొందవచ్చు.

 

Tags: Annapurna canteens in 32 centres

Post Midle
Post Midle