అన్నపూర్ణగా తెలంగాణ

Date:28/05/2020

హైద్రాబాద్ ముచ్చట్లు:

తెలంగాణ రాష్ట్రం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రజల ఆకలి తీర్చే అన్నపూర్ణగా అవతరించింది. దేశానికే ధాన్యాగారంగా నిలిచింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక స్థాయితో వరి దిగుబడులు సాధించి దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించింది. వరి ధాన్యం దిగుబడి, సేకరణలో అగ్రస్థానం సాధించింది. యాసంగి పంట వరి ధాన్యం సేకరణలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని ఎఫ్‌సీఐ తెలిపింది.ఈ ఏడాది భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 91.07 లక్షల టన్నుల్లో సగానికి పైగా తెలంగాణ నుంచే సేకరించిటన్లు పేర్కొంది. ఇప్పటి వరకూ దేశంలో 83.01 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరించగా అందులో రాష్ట్ర వాటానే అధికమని.. ఒక్క తెలంగాణ నుంచే 52.23 లక్షల టన్నులు సేకరించినట్లు వెల్లడించింది. భారత్‌లో వరి ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానం సాధించింది.

ఎన్టీఆర్ కు ఘనంగా నివాళి

Tags: Annapurna Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *