చదళ్ళ గ్రామంలో శ్రీ చౌడేశ్వరి దేవి వార్షికోత్సవం
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు మండలం, చదళ్ల గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ సప్త మాత్రుక సమేత శ్రీ చౌడేశ్వరి ఆలయం నిర్మించి 5 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సోమవారం నుండి బుదవారం వరకు 3 రోజుల పాటు వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నట్టు చౌడేశ్వరి దేవి ట్రస్ట్ వ్యవస్థాపకులు వేణు గోపాల్ రెడ్డి తెలియజేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మహిమ గల ఈ ఆలయంలో 3 రోజులపాటు ప్రత్యేక పూజలు, విశిష్ఠ హోమాలు నిర్వహించి ప్రత్యేక పూలంకరణలో అమ్మ వారు భక్తులకు దర్శనం ఇస్తారు కావున భక్తులందరూ పాల్గొని అమ్మ వారి కృపకు పాత్రులై అన్నప్రసాదము స్వీకరించాలని, ఈ కార్యక్రమాలన్నీ NVR ట్రస్ట్ సభ్యులు పర్యవేక్షణలో జరుగుతుందని తెలియజేశారు .ఈ కార్యక్రమంలో NVR ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి శివకుమార్ రెడ్డి, నరేంద్ర రెడ్డి, జయపాల్ రెడ్డి, శంకర్ రెడ్డి, చంద్ర మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

Tags:Anniversary of Shri Choudeshwari Devi in Chadalla village
