Annual Brahmots of Sri Prasanna Venkateswaraswamyavari at Appalalayagunta

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Date:30/05/2020

తిరుపతి ముచ్చట్లు:

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు జూన్‌ 2 నుంచి 10వ తేదీ వరకు జరుగనున్నాయి. కరోనా కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ ఉత్సవాల‌ను ఆల‌య ప్రాంగణంలో ఏకాంతంగా నిర్వహిస్తారు. వాహనసేవల‌ ఊరేగింపును రద్దు చేశారు.జూన్‌ 2వ తేదీ మంగళవారం ఉదయం 10.30 నుంచి 11 గంటల‌ వరకు ధ్వజారోహణం జరుగనుంది. ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9 గంటల‌ వరకు, సాయంత్రం 6 నుండి 7 గంటల‌ వరకు ఆల‌య ప్రాంగణంలో తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. జూన్ 5న సాయంత్రం 4.30 నుండి 6.30 గంటల‌ వరకు శ్రీవారి కల్యాణోత్సవం ఏకాంతంగా నిర్వహిస్తారు. జూన్‌ 10న ఉదయం 9.30 నుండి 10 గంటల‌ వరకు ఆల‌య ప్రాంగ‌ణంలో ఏకాంతంగా గంగాళంలో చక్రస్నానం చేపడతారు.

డాక్టర్ సుధాకర్ పై  సాధింపు చర్యలు మానుకోవాలి

Tags: Annual Brahmots of Sri Prasanna Venkateswaraswamyavari at Appalalayagunta

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *