Natyam ad

27 నుండి అక్టోబరు 5వ తేదీ వరకు ఉపమాక శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి ముచ్చట్లు:

టిటిడికి అనుబంధంగా ఉన్న అనకాపల్లి  జిల్లా నక్కపల్లి మండలం, ఉపమాకలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబ‌రు 27 నుండి అక్టోబరు 5వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబ‌రు 26వ తేదీన ఉదయం 9.08 గంటలకు తిరువీధిలో బ్రహ్మోత్సవ కావిడితో ఈ ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి. రాత్రి అశ్వవాహనం, అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

 

Post Midle

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

 

– సెప్టెంబ‌రు 27న ఉద‌యం ధ్వ‌జారోహ‌ణం, రాత్రి శేష‌తల్ప వాహ‌నం.

 

– సెప్టెంబ‌రు 28న ఉద‌యం రాజధిరాజ వాహ‌నం, రాత్రి హంస వాహ‌నం.

 

– సెప్టెంబ‌రు 29న ఉద‌యం ఇత్త‌డి స‌ప్ప‌రం, రాత్రి పెద్ద ప‌ల్ల‌కీ ఉత్స‌వం.

 

– సెప్టెంబ‌రు 30న ఉద‌యం ఆంజ‌నేయ వాహ‌నం, రాత్రి ల‌క్క గ‌రుడ వాహ‌నం.

 

– అక్టోబ‌రు 1న ఉద‌యం స‌ప్ప‌రం వాహ‌నం, రాత్రి రాజాధిరాజ వాహ‌నం.

 

– అక్టోబ‌రు 2న ఉద‌యం వ‌సంతోత్స‌వం, రాత్రి ఇత్త‌డి గ‌రుడ వాహ‌నం.

 

– అక్టోబ‌రు 3న ఉద‌యం ర‌థోత్స‌వం, రాత్రి పుణ్య‌కోటి వాహ‌నం.

 

– అక్టోబ‌రు 4న ఉద‌యం మృగ‌వేట‌, రాత్రి గ‌జ వాహ‌నం.

 

– అక్టోబ‌రు 5న ఉద‌యం పూర్ణాహుతి, చ‌క్ర‌స్నానం, రాత్రి ధ్వ‌జావ‌రోహ‌ణం.

 

అదేవిధంగా, సెప్టెంబ‌రు 26 నుండి అక్టోబరు 5వ తేదీ వరకు గ‌రుడాద్రి ప‌ర్వ‌తం(కొండ‌)పై మూల‌విరాట్‌స్వామివారికి నిత్య,, ప్ర‌త్యేక అభిషేకాలు త‌దిత‌ర కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

 

Tags: Annual Brahmotsavam at Upamaka Sri Venkateswara Swamy Temple from 27th to 5th October

Post Midle

Leave A Reply

Your email address will not be published.