మే 13 నుండి 21వ తేదీ వరకుతుమ్మూరు శ్రీ కరిమాణిక్యస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం తుమ్మూరు గ్రామంలోని శ్రీ కరిమాణిక్యస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 13 నుండి 21వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందులోభాగంగా గురువారం సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

13-05-2022 ధ్వజారోహణం శేష వాహనం

14-05-2022 తిరుచ్చి ఉత్సవం హనుమంత వాహనం

15-05-2022 ద్వార దర్శనం గరుడసేవ

16-05-2022 తిరుచ్చి ఉత్సవం హంస వాహనం

17-05-2022 తిరుచ్చి ఉత్సవం విమాన వాహనం

18-05-2022 తిరుచ్చి ఉత్సవం మోహినీ అవ‌తారం, సింహవాహనం, గజవాహనం, స్వామివారి కల్యాణం.

19-05-2022 రథోత్సవం తిరుచ్చి ఉత్సవం

20-05-2022 తిరుచ్చి ఉత్సవం పార్వేట ఉత్సవం

21-05-2022 చక్రస్నానం ధ్వజావరోహణం

22-05-2022 అభిషేకం పుష్పయాగం

బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 8 నుండి 9.30 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. మే 18వ తేదీ సాయంత్రం స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు.

 

Tags:Annual Brahmotsavam of Tummuru Sri Karimanikyaswamy from 13th to 21st May

Leave A Reply

Your email address will not be published.