జూన్ 20 నుండి 22వ తేదీ వరకు శ్రీసుందరరాజస్వామివారి వార్షిక అవతార మహోత్సవాలు

తిరుపతి ముచ్చట్లు:

 

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాలు జూన్ 20 నుండి 22వ తేదీ వరకు మూడు రోజుల పాటు వైభవంగా జరుగనున్నాయి.ఇందులో భాగంగా ప్రతి రోజు ఉదయం
శ్రీ సుందరరాజస్వామివారిని సుప్ర‌భాతంతో మేల్కొలిపి, సహస్రనామార్చన, నిత్యార్చ‌న నిర్వహిస్తారు.జూన్ 20, 21, 22వ తేదీలలో మధ్యాహ్నం 2 నుండి 3.30 గంటల వరకు శ్రీ కృష్ణస్వామి ముఖమండపములో శ్రీదేవి, భూదేవి స‌మేత
శ్రీ సుందరరాజస్వామివారికి వైభవంగా అభిషేకం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేస్తారు. అనంతరం సాయంత్రం 5.30 నుండి 6.15 గంటల వరకు శ్రీ కృష్ణస్వామివారి ముఖమండపంలో ఊంజల్‌ సేవ జరుగుతుంది.జూన్ 20వ తేదీ రాత్రి 7 గంటల నుండి 8.30 గంటల వరకు శ్రీసుందరరాజస్వామివారు పెద్దశేష వాహనం, 21వ తేదీ రాత్రి 7 గంటల నుండి 8.30 గంటల వరకు హనుమంత వాహనం, 22వ తేదీ రాత్రి 7 గంటల నుండి 8.30 గంటల వరకు గరుడ వాహనంపైన, ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా జూన్ 20 నుండి 22వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఊంజ‌ల‌సేవను రద్దు చేశారు.

 

Tags: Annual Incarnation Festival of Sreesundarajaswamy from 20th to 22nd June