21 నుంచి 23వ తేదీ వరకుబెంగళూరులోని శ్రీ వేంకటేశ్వరాలయంలో వార్షిక వసంతోత్సవాలు

తిరుపతి ముచ్చట్లు:

 

బెంగళూరులోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 21 నుంచి 23వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి.ఈ సందర్భంగా ప్రతిరోజు మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4-30 గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5-30 నుంచి 6 గంటల వరకు అస్థానం చేపడతారు. సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా నిర్వహిస్తారు.గృహస్తులు (ఇద్దరు) రూ.1000/- చెల్లించి ఒక రోజు వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. ఈ సేవలో పాల్గొన్న గృహస్తులకు ఒక ఉత్తరీయం, రవికె, ఒక పెద్ద లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు.

 

Tags:Annual Spring Festival at Sri Venkateswara Temple, Bangalore from 21st to 23rd

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *