తిరుచానూరులో శ్రీ సుంద‌ర‌రాజ‌స్వామివారికి అభిషేకం

తిరుచానూరు ముచ్చట్లు:

 

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలలో భాగంగా రెండ‌వ రోజైన సోమ‌వారం
శ్రీ సుందరరాజస్వామివారికి అభిషేకం జ‌రిగింది. కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్నారు.ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 నుండి 4.00 గంటల వరకు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ సుందరరాజస్వామివారి ఉత్స‌వ‌మూర్తుల‌కు అభిషేకం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, ఇత‌ర సుగంధ ద్ర‌వ్యాల‌తో ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు.కాగా జూన్ 22 నుండి 24వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవ మూర్తులకు అభిషేకం నిర్వహిస్తారు.ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో  క‌స్తూరి బాయి, ఏఈవో  ప్ర‌భాక‌ర్ రెడ్డి, సూప‌రింటెండెంట్  శేష‌గిరి, ఆల‌య అర్చ‌కులు  బాబుస్వామి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ రాజేష్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags: Anointing of Sri Sundarajaswamy at Thiruchanur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *