పుంగనూరులో సీఎం జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం

పుంగనూరు ముచ్చట్లు:

సచివాలయ కార్యదర్శులను రెగ్యూలర్‌ ఉద్యోగులుగా ప్రభుత్వం గుర్తించడంతో సచివాలయ ఉద్యోగులు కలసి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మంగళవారం మండలంలోని చదళ్ల సచివాలయ కార్యదర్శి ఆయేషా, మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి కలసి ఈ కార్యక్రమం నిర్వహించారు. అయేషా మాట్లాడుతూ ముఖ్యమంత్రి మాట ఇచ్చిన మేరకు ఉద్యోగులను రెగ్యూలర్‌ చేయడం , పీఆర్‌సీ వర్తింప చేయడం అభినందనీయమన్నారు. సచివాలయ ఉద్యోగులు తరపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కార్యదర్శులు ఆనందకుమార్‌, భరత్‌కుమార్‌, కళ్యాణి, భానుప్రకాష్‌, షబిలా, వలంటీర్లు పాల్గొన్నారు.

 

Tags: Anointing to paint CM Jagan in Punganur

Leave A Reply

Your email address will not be published.