పట్టణ భాజపా ఆధ్వర్యంలో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

మందమర్రి ముచ్చట్లు :

మందమర్రి పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మద్ది శంకర్ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని 7,14వ వార్డుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం క్రింద కేంద్ర ప్రభుత్వం ఇప్పుడిచ్చే 5 కిలోల బియ్యానికి అదనంగా 5 కిలోలు కలిపి మొత్తం ప్రతి ఒక్కరికీ 10 కిలోల బియ్యాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీపావళి వరకు ఉచితంగా ఇవ్వాలని అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఈ నెల 21వ తారీకునుండి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని  తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తూ పట్టణంలో ని 7వ వార్డు,14వ వార్డు లలో  నరేంద్రమోదీ చిత్రపటానికి పాలాభిషేఖం చేసి వారికి  ధన్యవాదాలు తెలియజేశామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు మద్దిశంకర్, యువమోర్చా అధ్యక్షుడు,రంగు శ్రీనివాస్, పట్టణ ఉపాధ్యక్షులు బియ్యాల సమ్మయ్య, ప్రధాన కార్యదర్శి సేపూరి లక్ష్మణ్, బిసిమోర్చా అధ్యక్షుడు పూసాల ఓదెలు, వి.సదానందం, యువమోర్చా ప్రధాన కార్యదర్శి జంగం మధు,బూత్ అధ్యక్షుడు కాంపెల్లి సుధాకర్,యువమోర్చా నాయకుడు ఓరుగంటి సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Anointing to paint Modi under the auspices of the urban BJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *