’ మరో 60 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గెట్

"Another 60 lakh tonnes of coal production target

"Another 60 lakh tonnes of coal production target

Date:16/04/2018
ఖమ్మం ముచ్చట్లు:
ఈ ఏడాది సింగరేణి 680 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సింగరేణి సంస్థ ప్రకటించింది. గత ఏడాది 620 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేశామని, అదనంగా మరో 60 లక్షల టన్నుల బొగ్గును ఈ ఏడాది ఉత్పత్తి చేయాలని నిర్ణయించినట్లు సింగరేణి సంస్థ ఎండి ఎన్ శ్రీ్ధర్ ప్రకటించారు. సింగరేణిలో 19 ఓపెన్ కాస్ట్ గనులు, 24 భూగర్భ గనులు ఉన్నాయన్నారు. అధికోత్పత్తికి అవరోధాలను సూక్ష్మస్థాయి నుంచి పై స్థాయి వరకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన వివరించారు. 2018-19లో వార్షిక ఉత్పత్తి లక్ష్యాలసాధనకు మొదటి నుంచి నెల ఏప్రిల్ నుంచి ప్రణాళిక బద్ధంగా ముందుకు పోవాలని ఆయన ఆదేశించారు. ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఉపేక్షించబోమన్నారు. రామగుండం -2 ఏరియాలో ఓపెన్ కాస్ట్-3 గనిలో భారీ యంత్రాలు వంద శాతం పని గంటలు పనిచేయడాన్ని అభినందించారు. కార్మికులకు మెడికల్ కార్డులను సత్వరమే జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఐటి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్ధంగా ఉపయోగించుకుని ఉద్యోగులకు నాణ్యమైన సేవ లు అందిస్తామని, బొగ్గును ఉత్పత్తి చేస్తామని చెప్పారు. పర్యావరణ రహిత చర్యలు, జాగ్రత్తలను సమర్థంగా అమలు చేయాలన్నారు.
Tags:”Another 60 lakh tonnes of coal production target

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *