ఆంధ్రప్రదేశ్‌కు మరో 9 లక్షల కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసులు

అమరావతి  ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్‌కు మరో 9 లక్షల కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసులను గురువారం కేంద్రం పంపింది. పుణేలోని సీరం ఇనిస్టిట్యూట్‌ నుంచి మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి వ్యాక్సిన్‌ డోసులు చేరాయి. ఆరోగ్యశాఖ అధికారులు వీటిని గన్నవరంలోని రాష్ట్ర వ్యాక్సిన్‌ నిల్వ కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి ఆయా జిల్లాలకు అవసరాలకు అనుగుణంగా వీటిని సరఫరా చేయనున్నారు. టీకాలు అందడంతో పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

 

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Another 9 lakh Kovshield vaccine doses for Andhra Pradesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *