రిషికొండకు మరో ఘనత
విశాఖపట్నం ముచ్చట్లు:
ఘన కీర్తిని సొంతం చేసుకున్న విశాఖ రుషికొండ బీచ్ మరో ఘనతను సాదించింది.బ్లూఫాగ్ సర్టిఫికెట్ పొంది ప్రపంచ దేశాల్లో అత్యంత సుందర తీరంగా ప్రత్యేక గుర్తింపు సాదించుకున్న ఈ సాగర తీరంలో బ్లూ ఫ్లాగ్ హోస్టింగ్ అధికారుల సమక్షంలో అట్టహాసంగా జరిగింది.విశాఖ సాగరతీరానికి మణిహారం,ప్రకృతి రమణీయతకు కేరాఫ్ గా ఉన్న రుషికొండ బీచ్ అంతర్జాతీయ గుర్తింపు పొందడమే కాకుండా బ్లూఫాగ్ సర్టిఫికెట్ ను రుషికొండ బీచ్ దక్కించుకుంది. ఆహ్లాదబరిత వాతావరణంలో సాగరతీరం అందాలను ఆశ్వాదించే పర్యాటకులకు ఈ రుషికొండ బీచ్ రెడ్ కార్పెట్ పరుస్తూ మధురానుభూతిని అందిస్తోంది.బ్లూఫాగ్ సర్టిఫికెట్ ను సాదించిన రుషికొండ బీచ్ కు ప్రత్యేక గుర్తింపు ఉండేలా బ్లూఫాగ్ జెండాను బీచ్ మెనేజ్ మెంట్ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు.సర్టిఫికేషన్ సాదించుకున్న ఈ రుషికొండ తీర ప్రాంతాల్లో సౌకర్యాలు,వసతుల విషయంలో ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నామని మరిన్ని బీచ్ లను మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దిడం తో పాటు,రక్షణ చర్యలు కూడా చేపడతామని జీవిఎంసీ కమీషన్ సాయికాంత్ వర్మ తెలిపారు.
Tags; Another achievement for Rishikonda

