ఖమ్మం జిల్లాలో మరో దారుణం

ఖమ్మం  ముచ్చట్లు:

ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మరో ఇంజెక్షన్ మర్డర్ వెలుగు చూసింది. ఆస్పత్రిలో ఉన్న బాలింతను కనీస కనికరం లేకుండా హత్య చేశాడు భర్త. సెలైన్‌లో మత్తు మందు ఎక్కించి హతమార్చాడు. అనంతరం వైద్యుల వల్లే చనిపోయిందంటూ రచ్చ చేశాడు. చివరికు అసలు విషయం బయపటంతో ఊచలు లెక్కిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలోని పెద్దతండాకు చెందిన భిక్షం ల్యాబ్ టెక్నీషియన్‌గా చేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు. రెండో భార్య గర్భవతి కాగా, ప్రసవం కోసం ఆస్పత్రికి తరలించారు. చికిత్సలో భాగంగా వైద్యులు ఆమెకు సెలైన్స్ ఎక్కించారు. అయితే, మహిళ అపస్మారకస్థితిలో ఉండగా ఆమె సెలైన్‌ బాటిల్‌కు మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు భిక్షం. అనంతరం అక్కడి నుంచి జారుకున్నాడు. మత్తు ఇంజెక్షన్ కారణంగా గర్భిణీ స్త్రీ మృతి చెందింది. ఆస్పత్రి సిబ్బంది.. బాలింత మృతి విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేశారు.

 

 

 

దీన్నే అవకాశంగా మార్చుకున్న భర్త భిక్షం.. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన భార్య చనిపోయిందంటూ నానా రచ్చ చేశాడు. ఆస్పత్రి సిబ్బందిపై దౌర్జన్యం చేశాడు. ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు భిక్షం, అతని కుటుంబ సభ్యులకు సర్దిచెప్పారు. దాంతో అతను సైలెంట్ అయ్యాడు.అయితే, ఇదంతా కొద్దిరోజుల క్రితం జరిగింది. కానీ, ఘటనపై విచారణ చేపట్టిన అధికారులకు దిమ్మతిరిగే నిజం తెలిసిందే. అసలు దోషి మరెవరో కాదు.. ఆస్పత్రిలో రచ్చ చేసిన భర్తే అని తేలింది. దాంతో ఖంగుతినడం అధికారులవంతైంది. అవును, తన భార్యను భిక్షం హతమార్చినట్లు ఆస్పత్రిలోని సీసీకెమెరా ఫుటేజీల ద్వారా తేలింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడు భిక్షంను అరెస్ట్ చేశారు. భార్యను హతమార్చడానికి గల కారణంపై కూపీ లాగుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Tags: Another atrocity in Khammam district

Leave A Reply

Your email address will not be published.