Natyam ad

తెలంగాణలో మరో దారుణం

పాతబస్తీలో పరువు హత్య

హైదరాబాద్ ముచ్చట్లు:


నగరశివారులోని బాలాపూర్ పోలీస్టేషన్ పరిధి వాదియే ఓమర్ కాలనిలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వాష్ రూమ్ కోసం బయటకు వచ్చిన యువకుని కత్తులతో దాడిచేసిన  గుర్తుతెలియని దుండుగులు దారుణగా హతమార్చారు.  హత్యకు సంబంధించిన వివరాలను డిసిపి సిహెచ్ శ్రీనివాస్ వెల్లడించారు. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన డెగావత్ పవణ్ అనే యువకుడు ఇంటర్ వరకు చదివాడు. చదువు అపేసిన అతను పని చేస్తూ ఉంటున్నాడు. అయితే గత అర్థరాత్రి వాష్ రూమ్ కోసం బయటకు వచ్చిన పవణ్ ఎవరో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు అతనిపై కత్తులతో దాడికి తెగబడ్డారు. దీంతో అతను అరుపులు విన్న కుటుంబ సభ్యులు బయటకు వచ్ఛె లోపు ఇద్ధరు పరుగులు తీశారు. తీవ్రంగా గాయపడ్డ పవణ్ మృతి చెందాడు. దీంతో విషయం తెలుసుకున్న డిసిపి శ్రీనివాస్, ఎసిపి అంజయ్య తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలనపై దర్యాప్తు చేపట్టారు. పవణ్ పై దాడి చేసిన వ్యక్తులు ఎవరు ఎందుకు దాడి చేశారు అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.అయితే, మృతుడికి  అదే ప్రాంతానికి చెందిన ఓ ముస్లిం అమ్మాయి తో పరిచయం అయి ప్రేమగా మారింది. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి బంధువులు అర్ధరాత్రి  కత్తులతో నరికి చంపారని సమాచారం.

Post Midle

Tags: Another atrocity in Telangana

Post Midle