Natyam ad

పెన్నా పై మరో బ్రిడ్జి

నెల్లూరు ముచ్చట్లు:


పెన్నా నదిపై మరో వంతెన నిర్మాణానికి సిద్దమయింది. ఈ వంతెనకు అక్టోబర్ మొదటవారంలో శంకుస్థాపన జరగనుందని ఎమ్మెల్యే  అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ పెన్నా నదిపై ప్రస్తుతం వాహనాలు రాకపోకల సాగిస్తున్న బ్రిడ్జి 75 ఏళ్ల క్రితం నిర్మించారని అప్పుడు నుంచి మరో బ్రిడ్జిని నిర్మించాలని పాలకులు ఆలోచన చేయలేదన్నారు. పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని మరో బ్రిడ్జికి అనుమతి తీసుకువచ్చామన్నారు. త్వరలోనే  కోవూరు నుంచి నెల్లూరు వరకు సిక్స్ లైన్ రహదారిని   శంకుస్థాపన చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించి అధికారులు డిపిఆర్  సిద్ధం చేస్తున్నారని తెలిపారు . కోవూరు నుంచి నెల్లూరు వరకు సిక్స్ లైన్ రహదారిని విస్తరిస్తున్నామన్నారు.

 

Tags: Another bridge over Penna

Post Midle
Post Midle