బెజవాడలో మరో దారుణం

Another brutality in Bezewada

Another brutality in Bezewada

Date:16/07/2018

విజయవాడ ముచ్చట్లు:

బెజవాడలో పట్టపగలే ఓ ఇంట్లోకి ప్రవేశించి మహిళను హత్య చేసిన ఘటన మరవక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. ఓ గుర్తుతెలియని వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి నడిరోడ్డులో మరో వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. ఈ విషాద ఘటన సోమవారం సత్యనారాయణ పురం బీఆర్‌టీఎస్‌ రోడ్డులో జరిగింది.వివరాల్లోకి వెళితే.. చదలవాడ రాజు అనే వ్యక్తి రైల్వే ఇనిస్టిట్యూట్‌లో గేట్‌ మెన్‌ ట్రైనింగ్‌ తీసుకొవడానికి నగరానికి వచ్చారు. ఈ క్రమంలో శనివారం రోడ్డుపై వెళ్తుండగా గుర్తు తెలియని దుండగుడు పల్సర్‌ బైక్‌ మీద వచ్చి రాజుతో కాసేపు మాట్లాడాడు. అనంతరం రాజుని విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన రాజును స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.

 

బెజవాడలో మరో దారుణంhttps://www.telugumuchatlu.com/another-brutality-in-bezewada/

Tags: Another brutality in Bezewada

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *