మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులపై మరో కేసు నమోదు!

వెల్దుర్తి ముచ్చట్లు:

పిన్నెల్లి రామకృష్ణరెడ్డి సొంత ఊరు వెల్దుర్తి మండలం కండ్లకుంట గ్రామంలో టీడీపీ ఏజంట్ నోముల మాణిక్యం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.తొలిత సాయంత్రం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటానికి వచ్చిన భాదితుడు మాణిక్యం, టీడీపీ నేతలు.తమ పరిదిలోని ఘటన కాదని సంబందిత అధికారులకు పిర్యాదు చేయాలని సున్నితంగా తిరస్కరించిన రూరల్ పోలీసులు.తనను కులం పేరుతో, తన కుటుంబ సభ్యులను చంపేస్తానని వీడియో కాల్ చేసి మరి బెదిరించారని పిర్యాదులో పేర్కొన్న భాదితుడు.డీజీపీ కార్యాలయంకు వెళ్ళిన టీడీపీ నేతలు, డీజీపీ కార్యలయం అధికారులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తెలిపినట్టు టీడీపీ నేతల సమాచారం!

 

స్థానిక పోలీసులు తమకు సహాకరించలేదని, ఆ బూత్ లో నాడు ఎన్నికల రోజు ఉన్న అధికారులు సహకరించ లేదని వాపోయిన భాదితుడు.తిరిగి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు చేరిన పంచాయతీ. జీరో ఎఫ్ఐఆర్ కట్టేందుకు ఉన్నతాధికారుల అదేశాలతో కేసు నమోదు చేరనున్న రూరల్ పోలీసులు.దీంతో ఈ ఎన్నికల్లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడిపై మరో పిర్యాదు కేసు నమోదు.

 

Tags: Another case registered against MLA Pinnelli brothers of Machar!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *