కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి సీఎం శంకుస్థాపన

Another chapter in the sacred occasion

Another chapter in the sacred occasion

Date:12/01/2019
విజయవాడ  ముచ్చట్లు:
పవిత్రసంగమంలో మరో చరిత్రకు శ్రీకారం చుట్టామని సీఎం చంద్రబాబు అన్నారు. శనివారం ఇబ్రహీంపట్నం పవిత్రసంగమం వద్ద కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతిలో తిరుమల ఆలయంతో పాటు మసీదు, చర్చి నిర్మాణాలు చేపడతామని అయన  అన్నారు అందరి సహకారంతో విజయవాడను అభివృద్ధి చేస్తామన్నారు. పెన్షన్లు రూ. వెయ్యి నుంచి రూ. 2 వేలకు పెంచామని తెలిపారు. పేదల కోసం సంపదను సృష్టిస్తున్నామన్నారు. రాజధానిలో నిర్మాణాలు జరగడం లేదంటూ ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. సాంకేతికతను, ప్రకృతిని అనుసంధానం చేస్తూ అమరావతి నిర్మాణం చేస్తున్నామన్నారు. సుందర నగరంగా, గ్రీన్ ఫీల్డ్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామన్నారు. కూచిపూడి మన వారసత్వ సంపద అని, కూచిపూడి నాట్యాన్ని ప్రతిబింబించేలా బ్రిడ్జి నిర్మాణం చేపట్టున్నట్లు తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా ఇంత వేగంగా నిర్మాణం చేయలేదన్నారు  కూచిపూడి ఐకానిక్ బ్రిడ్జిగా నామకరణం చేస్తున్నామని సీఎం ప్రకటించారు. ప్రకృతి సేద్యానికి శ్రీకారం చుట్టామని, 6 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని టూరిజానికి హబ్గా తయారు చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు..  అద్భుతమైన నిర్మాణంగా అమరావతి అసెంబ్లీని నిర్మిస్తామని చంద్రబాబు అన్నారు.
Tags:Another chapter in the sacred occasion

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *