కారెక్కనున్న మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే

Another Congress MLA

Another Congress MLA

Date:14/03/2019
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో చావు దెబ్బ తగిలింది.  తాజాగా మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కారు ఎక్కేందుకు రంగం సిద్ధమయింది. పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి గురువారం తెలంగాణ రాష్ట్ర సమితి  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ అయ్యారు. ఇటీవల తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావుపై ఉపేందర్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. కోరుట్ల శాసనసభ్యుడు విద్యాసాగర్ రావు అయనను కేటీఆర్ దగ్గరకు తెచ్చారు. కేటీ ఆర్ తో భేటీ తరువాత ఉపేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. త్వరలోనే తాను టీఆర్ఎస్ లో చేరుతానని ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కేవలం టీఆర్ఎస్ తోనే సాధ్యమని స్పష్టం చేశారు. అనుచరులు, కార్యకర్తలు, మద్దతుదారుల అభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగ కాంతారావు కాంగ్రెస్ ను వీడిన సంగతి తెలిసిందే. మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా కారు ఎక్కేందుకు సిద్దమయ్యారు.
Tags:Another Congress MLA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *