మరో వివాదంలో కూన రవికుమార్

Date:25/05/2020

శ్రీకాకుళం ముచ్చట్లు:

టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై కేసు నమోదైంది. శ్రీకాకుళం జిల్లా పొందూరు తహసీల్దార్‌ తామరాపల్లి రామకృష్ణను అసభ్య పదజాలంతో దూషించిన ఆడియో వైరల్ అయింది.తెలుగు దేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు తహసీల్దార్‌ తామరాపల్లి రామకృష్ణను అసభ్య పదజాలంతో దూషించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై కేసు నమోదైంది. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. సోమవారం ఉదయం అరెస్ట్‌ చేసేందుకు రవికుమార్‌ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. అయితే అర్ధరాత్రే ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.రెండు రోజుల క్రితం బదిలీపై వెళ్లిన శ్రీకాకుళం జిల్లా పొందూరు తహసీల్దార్‌ రామకృష్ణకు టీడీపీ నేత, ప్రభుత్వ మాజీ విప్‌ కూన రవికుమార్‌ ఫోన్ చేసి బెదిరించారు.

 

 

 

ఈ నెల 16న గోరింట గ్రామంలోని రామసాగరం చెరువులో రవికుమార్‌ సోదరుడికి చెందిన రెండు జేసీబీలు, నాలుగు టిప్పర్లతో మట్టిని అక్రమంగా తవ్వుతుండగా వీఆర్‌ఓ నుంచి ఫిర్యాదు రావడంతో తహసీల్దార్‌ అక్కడకు చేరుకుని వాహనాలను సీజ్‌ చేశారు. దీంతో రవికుమార్‌ తహసీల్దార్‌కు ఫోన్‌చేసి బెదిరించారు. ‘వాహనాలు విడిచిపెట్టు.. లేకపోతే లంచం డిమాండ్‌ చేశావని నీ మీద కంప్లైంట్‌ చేస్తాను’ అని కూన రవికుమార్ బెదిరింపులకు దిగారు. తన చేతిలో ఏం లేదని, వాహనాలు సీజ్‌ చేసి అప్పగించేశానని తహసీల్దార్‌ చెప్పారు. దీంతో కూన దుర్భాషలాడుతూ.. ‘నువ్వు సీజ్‌ చేశావుగానీ ఫిర్యాదు చేయలేదని నాకు తెలుసు. ఎంత కావాలో చెప్పు.. రూ. పది వేలు కావాలా, రూ. లక్ష కావాలా? ఎంత కావాలి’ అంటూ లంచం ఇచ్చేందుకు ప్రలోభపెట్టారు.

 

 

 

 

దీంతో ఈ ఆడియో క్లిప్లింగ్‌ను తలహీల్దార్ రామకృష్ణ బయటపెట్టారు. కూన రవికుమార్‌ది రాక్షసతత్వమని పొందూరు తహసీల్దార్‌ రామకృష్ణ ఆరోపించారు. ఆయనకు ప్రభుత్వ అధికారులంటే చులకన అని, ప్రభుత్వ అధికారులను దూషించడం ఆయనకు అలవాటని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా అనేకసార్లు చాలాసార్లు తనను దుర్భాషలాడారని పేర్కొన్నారు. పాతేస్తానని రవికుమార్‌ తనను బెదిరించారని తెలిపారు. ఆఫీసులోకి చొరబడి దాడి చేయడానికి ప్రయత్నించారన్నారు. ఆయన అనుచరులు తన కారును వెంబడించి బెదిరింపులకు దిగారని రామకృష్ణ తెలిపారు. టీడీపీ నేత కూన రవికుమార్‌పై ఉద్యోగ సంఘాల ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయనపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

మహిళల ప్రేమ పేరుతో వల

Tags: Another controversy is Kunna Ravikumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *