Another Corona Patient in Punganur

పుంగనూరులో మరో కరోనా పేషెంట్‌

– రెడ్‌జోన్‌గా ప్రకటన
– నాలుగుకు చేరిన రోగుల సంఖ్య

Date:03/06/2020

పుంగనూరు ముచ్చట్లు:

చెన్నై నుంచి పుంగనూరు పట్టణానికి వచ్చిన మరో వ్యక్తికి కరోనా సోకినట్లు కరోనా నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ చెన్నై నుంచి వచ్చిన వ్యక్తిని వైద్య సిబ్బంది ఈనెల 1 న గుర్తించి ట్రూనాట్‌ పరీక్షలు చేపట్టామన్నారు. కరోనా నిర్ధారించడం జరిగిందన్నారు. రోగిని తిరుపతి కోవిడ్‌ ఆసుపత్రికి తరలించామన్నారు. ఈ మేరకు మున్సిపల్‌ , పోలీస్‌ అధికారులకు సమాచారం అందించామన్నారు.

రెడ్‌ జోన్‌ ఏర్పాటు…

పట్టణంలోని గాంధినగర్‌లో కరోనా సోకడంతో ఆ ప్రాంతంలోని 200 మీటర్ల విస్తీర్ణంలో గల ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించినట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. గాంధినగర్‌, మోతినగర్‌, నెహ్రునగర్‌, రామకృష్ణారెడ్డి నగర్‌, ఆరవవాండ్ల ఇండ్లు, సనావుల్లా కాంపౌండు, ఏటిగడ్డపాళ్యెం రెడ్‌జోన్‌ పరిధిలో ఉందన్నారు. అలాగే 400 మీటర్ల విసీర్ణం గల 13 ప్రాంతాలను బఫర్‌జోన్‌గా నియమించామన్నారు. ఈ మేరకు పట్టణ సీఐ గంగిరెడ్డి, వైద్య సిబ్బందితో కలసి ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ మేరకు రెడ్‌జోన్‌ ప్రాంతంలో రాకపోకలను నిషేధించారు. బాదితుల ఇంటిని, పరిసర ప్రాంతాల్లోని ఇండ్లను డిస్‌ఇన్‌ఫెక్షన్‌ చేశారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి, మురుగునీటి కాలువల్లో బ్లీచింగ్‌, ఫినాయిల్‌ స్ప్రే చేశారు. అలాగే ఫాగింగ్‌ చేపట్టారు. కాగా పట్టణంలోని రహమత్‌నగర్‌, కట్టక్రిందపాళ్యెం, దోబీకాలనీ, ప్రస్తుతం గాంధినగర్‌తో నాలుగు కేసులు నమోదైంది. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు ఉమా మహేశ్వరరావు, తిప్పేస్వామి, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సఫ్ధర్‌, వైద్యశాఖ సూపర్‌వైజర్లు హరినాథరెడ్డి, మురళి కార్మికులు పాల్గొన్నారు.

గవర్నర్ ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వేముల

Tags: Another Corona Patient in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *