Another couple in Tollywood

టాలీవుడ్ లో మరో కపుల్

Date:3/08/2020

హైద్రాబాద్ ముచ్చట్లు:

 

టాలీవుడ్ లో పెళ్లిళ్ళ సందడి నడుస్తోంది. ఇప్పటికే నిఖిల్, నితిన్ పెళ్ళిళ్ళు అయిపోయాయి. నెక్స్ట్ దగ్గుబాటి వారి వారసుడు భళ్ళాలదేవుడు రానా పెళ్ళికి రెడీ అయ్యాడు. మిహికా బజాజ్ తో త్వరలో పెళ్లి జరగబోతోంది. తాజాగా మరో హీరో పెళ్లికొడుకు కాబోతున్నాడనే వార్త హల్ చల్ చేస్తోంది. రవిరాజా పినిశెట్టి కుమారుడిగా ఎంట్రీ ఇచ్చి నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఆదిపినిశెట్టి. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఏదైనా సరే ఆది ఓకే చెప్పేస్తాడు. రంగస్థలం చిత్రంలో అశోక్ బాబుగా ఇండస్ట్రీని ఫిదా చేశాడు. అంతకు ముందు ‘నిన్ను కోరి’ సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసి నానితో పాటు క్రేజ్ సంపాదించాడు.

తన బాడీ ఫిట్‌నెస్, విలనిజంతో సరైనోడు సినిమాలో ఎంతగా మెప్పించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయువ హీరో పెళ్లి వార్త ఇపుడు కోలీవుడ్‌, టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆది పినిశెట్టి హీరోయిన్ నిక్కీ గల్రానీని వివాహం చేసుకునేందుకు రెడీ అవుతున్నాడని అంటున్నారు. ఆది తండ్రి రవిరాజా ఇటీవల నిర్వహించిన బర్త్ డే వేడుకల్లో వారి ఫ్యామిలీ ఫొటోలో నిక్కీ కనిపించింది.

దీంతో ఈవార్తలకు మరింత బలం చేకూరింది. కరోనా పరిస్థితులు చక్కబడ్డాక వీరి పెళ్లి ఉంటుందని సమాచారం. మలుపు, మరకతమణి చిత్రాల్లో ఆది, నిక్కీ గల్రానీ కలిసి నటించారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి ఆది, నిక్కీ గల్రానీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. నిక్కీ గల్రానీ అంటే ఆదికి ఇష్టమని, వీరిద్దరి పెళ్ళికి త్వరలో గ్రీన్ సిగ్నల్ రానుందని అంటున్నారు.

 

సాయి ప్రతాప్… ఇప్పుడేం చేయాలి

Tags:Another couple in Tollywood

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *