దాచేపల్లిలో మరో దారుణం

Date:12/05/2018
గుంటూరు ముచ్చట్లు:
గుంటూరు జిల్లా దాచేపల్లిలో మరో దారుణం బయటపడింది. 12 ఏళ్ల బాలికపై రాజకీయ నేత అఘాయిత్యానికి పాల్పడటం కలకలంరేపింది. దాచేపల్లి మండల కో ఆప్షన్ సభ్యుడు మహబూబ్ వలీ కొంతకాలంగా బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఆమె భయపడింది. బాధితురాలి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ డాక్టర్లు గర్భవతని తేల్చడంతో… భయంతో తల్లిదండ్రులకు విషయం చెప్పిందట. వారు స్థానికులతో కలిసి పోలీసుల్ని ఆశ్రయించారు.బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమెను ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. మహబూబ్ వలీ గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇటీవలే ఓ బాలికపై 55 ఏళ్ల సుబ్బయ్య అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత నిందితుడు ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఆ ఘటన మర్చిపోకముందే మరొకటి జరగడం స్థానికంగా కలకలంరేపుతోంది.
Tags: Another dilemma at Thackappally

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *