19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

Another dip in the Bay of Bengal on 19

Another dip in the Bay of Bengal on 19

Date:16/07/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
ఈనెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 14న ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఒడిషా ప్రాంతంపై కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ తెలంగాణలో పలుచోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మరో రెండు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.ఇప్పటికేనైరుతి రుతుపవనాలుఅల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోనేకాదు దేశమంతటా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులకు భారీగా నీరు చేయడంతో గేట్లు ఎత్తివేస్తున్నారు. దీనికి తోడు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలవల్ల గోదావరి,తుంగభద్ర, నాగావళి,వంశధార నదులకు ప్రవాహ ఉధృతి పెరిగింది.
19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనంhttps://www.telugumuchatlu.com/another-dip-in-the-bay-of-bengal-on-19/
Tags; Another dip in the Bay of Bengal on 19

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *