ట్రాక్టర్‌తో రైతును తొక్కించబోయిన మరో రైతు.. షాకింగ్ వీడియో..
నల్లగొండ ముచ్చట్లు:
భూవివాదం హత్యాయత్నానికి దారి తీసింది. తన ప్రత్యర్ధులను ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నించారు దుర్మార్గులు. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం మునుకుంట్లలో జరిగిందీ ఘటన.రైతులు రవీందర్… విజయ్, సుధాకర్ మధ్య కొన్నాళ్లుగా భూవివాదం కొనసాగుతోంది. వివాదం నడుస్తోన్న భూమిలో విజయ్, సుధాకర్ కలిసి ట్రాక్టర్‌తో చదును పనులు చేపట్టారు. దాంతో, ఆ పనులను అడ్డుకునే ప్రయత్నం చేశాడు రవీందర్. కానీ, దాడి చేయాలని ముందే నిర్ణయించుకున్న విజయ్, సుధాకర్‌లు.. రవీందర్‌ను ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నించారు.రవీందర్‌తోపాటు అతని కుటుంబ సభ్యులపైనా దాడి చేశారు విజయ్, సుధాకర్. అడ్డుకునేందుకు ప్రయత్నించినా మహిళపైకి కూడా ట్రాక్టర్‌ను పోనిచ్చారు. ఈ ఇన్సిడెంట్ స్థానికంగా కలకలం రేపింది. చుట్టుపక్కల ఉండే రైతులు ఈ దారుణాన్ని వీడియో తీయడంతో విజయ్, సుధాకర్ చేసిన హత్యాయత్నం బయటపడింది.
Tags; Another farmer trampled a farmer with a tractor.. Shocking video..

