కామన్ వెల్త్ గేమ్స్ లో మరో పతాకం
న్యూఢిల్లీ ముచ్చట్లు:
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మరో పతకం సాధించింది. హైజంప్‌లో తేజస్విన్ శంకర్ కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ హైజంప్ విభాగంలో దేశానికి పతకం సాధించిన తొలి అథ్లెట్‌గా రికార్డుల్లో నిలిచాడు. బుధవారం రాత్రి జరిగిన హైజంప్ ఫైనల్స్‌లో శంకర్ 2.22 మీటర్ల దూరం దూకి మూడో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్‌కు చెందిన హమీష్ కెర్ 2.25 మీటర్ల జంప్‌చేసి మొదటి స్థానంలో నిలువగా, ఆస్ట్రేలియాకు చెందిన బ్రండన్ స్టార్క్ సిల్వర్ సాధించాడు. జూన్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో శంకర్ 2.27 మీటర్ల దూరం జంప్ చేయడం గమనార్హం. శంకర్ గత రికార్డుతో పోల్చితే కామన్వెల్త్లో కొంత నిరాశ పరిచినప్పటికీ హైజంప్‌లో దేశానికి తొలిపతకం తీసుకొచ్చిన ప్లేయర్‌గా నిలిచాడు.కాంస్య పతకం సాధించిన శంకర్‌ను కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అభినందించాడు. కామన్వెల్త్ క్రీడల్లో హైజంప్ విభాగంలో పతకం సాధించిన మొదటి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడని ప్రశంసించారు.
బర్మింగ్ హోమ్
కామన్వెల్త్ మహిళా క్రికెట్లో టీమ్ఇండియా సెమీస్‌కు దూసుకెళ్లింది. బార్బడోస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ 100 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో గ్రూప్-ఏ నుంచి సెమీస్‌కు అర్హత సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియాకు ఆదిలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ స్మృతి మంధాన (5), కెప్టెన్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (డకౌట్), తానియా (6) తక్కువ స్కోర్లకే వెనుతిరిగారు. అయితే మరో ఓపెనర్ షషాలీ వర్మ (43), రోడ్రిగ్స్ (56 నాటౌట్) తో కలిసి జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లింది. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో షెఫాలీ ఔటవడంతో క్రీజ్‌లోకి వచ్చిన హర్మన్ డకౌట్ అయింది. ఆ తర్వాత వచ్చిన తానియా కూడా వెంటనే పెవీలియన్‌కు చేరడంతో జట్టు కష్టాల్లో కూరుకుపోయింది. అయితే రోడ్రిగ్స్‌కు దీప్తి శర్మ (31 నాటౌట్) తోడవడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.163 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బార్బడోస్ బ్యాటర్లు.. భారత బౌలర్ రేణుకా సింగ్ విజృంభణతో చేతులెత్తేశారు. రేణుకా సింగ్ 10 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టింది. బార్బడోస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 62 పరుగులు మాత్రమే చేసింది. దీంతో టీమ్ఇండియా 100 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.
బ్యాడ్మింటన్ లో రజతం సరి
బ్యాడ్మింటన్‌లో భారత్‌కు నిరాశే ఎదురైంది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత్ 1-3 తేడాతో మలేషియా చేతిలో ఓడి రజత పతకంతో సరిపెట్టుకుంది. ఆట విషయానికొస్తే..తొలుత జరిగిన పురుషుల డబుల్స్‌లో భారత స్టార్ ద్వయం సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్‌శెట్టి 18-21, 15-21తో మలేషియా జోడీ టెంగ్ఫాంగ్ ఆరోన్, వుయి యిక్ సోక్ చేతిలో ఓటమిపాలైంది. సుదీర్ఘ ర్యాలీలతో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో మలేషియా జంటకు సాత్విక్, చిరాగ్ జంట దీటైన పోటీనివ్వలేకపోయింది. ఆ తర్వాత జరిగిన మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు 22-20, 21-17తో గోహ్ జిన్ వీపై చెమటోడ్చి నెగ్గింది. తన(7) కంటే తక్కువ ర్యాంక్(60)లో ఉన్న మలేషియా షట్లర్‌పై గెలిచేందుకు సింధు చెమటోడ్చాల్సి వచ్చింది. పురుషుల సింగిల్స్‌లో సీనియర్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు నిరాశే ఎదురైంది. తైజి యంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 19-21, 21-6, 16-21తో ఓటమి పాలయ్యాడు. అప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న మలేషియా అదే జోరు కొనసాగిస్తూ మహిళల డబుల్స్‌లో తినా మురళీధరన్, కూంగ్ లీ పెర్లీ ద్వయం 21-18, 21-17తో భారత జోడీ గాయత్రి గోపీచంద్, త్రిసా జాలీపై గెలిచి పసిడి పతకాన్ని ఖాతాలో వేసుకుంది.
Tags: Another flag in the Commonwealth Games