Natyam ad

గల్ఫ్ గుప్పెట్లో అగిన మరో గుండే

-ఎంపీ అరవింద్ టీం,గల్ఫ్ జేఏసి ప్రతినిధి మురళీధర్ రెడ్డి గంగుల,
 
నిజామాబాద్  ముచ్చట్లు:
జిల్లా లోని బాల్కొండ నియోజకవర్గం ముప్కాల్ మండలం వేంపల్లి కి చెందిన చిన్నోల్ల నర్సయ్య (48) ఒమన్ లోని ప్రీమియర్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ కంపెనీలో కన్స్ట్రక్షన్ లేబర్ గా గత ఆరు ఏండ్లుగా పని
చేశాడు. ఈనెల 14 జనవరి,22న గుండెపోటుతో మరణించాడు. మృతుని బంధువులు తేలు నరేష్ , శ్రీనివాస్ లు నియోజకవర్గ ఎం పి అరవింద్  కార్యాలయ అధికారులను సహాయం అర్థించగా , వారు కేంద్ర
ప్రభుత్వ వెబ్ పోర్టల్ మదద్ లో ఫిర్యాదు నమోదు చేశారు. ఎం పి కార్యాలయం ద్వారా విషయం తెలుసుకున్న గల్ఫ్ జేఏసి ప్రతినిధి ,సామాజిక కార్యకర్త మురళీధర్ రెడ్డి గంగుల వారి అనుమతి తో
రాయబార కార్యాలయం అధికారులతో, మృతుని కంపెనీ అధికారులతో మృతదేహాన్ని త్వరగా తెప్పించడానికి , మృతునికి రావాల్సిన జీతం, ఇండెమ్నిటి, బోనస్, టికెట్, ఓవర్ టైం లాంటి బకాయిలు
ఇప్పించడానికి క్లుప్తంగా ఈమెయిల్ ద్వారా అర్జీ పెట్టగా, వాట్సప్ ద్వారా రాయబార అధికారులు స్పందించి సహకరించారు. మృతుని కుటుంబం, బంధువులతో తేలు శ్రీనివాస్, జక్కుల రాముతో అర్జి పెట్టించి
తెలంగాణ ప్రభుత్వం  ద్వారా ఉచిత అంబులెన్స్ సహకారం అధికారి చిట్టిబాబు ద్వారా మురళీధర్ రెడ్డి తీసుకున్నారు. తోడుగా ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు స్వదేశ్ ఉచిత ఎంబులెన్స్ కు
సహకారం తీసుకున్నారు. ఒమన్ లో మృతుని కంపెనీలో పని చేస్తున్న సాయన్న , మృతుని బంధువులు నవీన్ వట్టే కంపెనీ అధికారులకు ఎం పి టీం ద్వారా సహకరించారు.అతని సంపాదన మీద
ఆధారపడి ఉండి, అనాధలైన తల్లి ముత్తమ్మ (60) భార్య లక్ష్మి(40) కూతురు అక్షయ(15) 9వ తరగతి, కుమారుడు వర్షిత్ (12) 6వ తరగతి చదువుతున్నారు.రెండు రూపాయల వడ్డికి లక్షన్నర అప్పు
చేసి దుబాయ్ లో 15 ఏళ్ళు ఒమన్ లో 6 ఏళ్ళు పని చేసి కూడా 5-6 లక్షల అప్పు  కూడగట్టుకున్నాడు. గత 9 నెలలుగా జీతం కోసం ఆరోగ్యం బాగా లేకుంటే లెక్క చేయక అక్కడే ఉండి బయటకు
చెప్పుకోలేక ఇదంతా జరిగిందని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. అప్పులు  తీర్చడానికి ఉన్న ఎకరం పొలం అమ్మినా సరిపోవని, అమ్మితే భవిష్యత్తు లేదని,తమకు వర్తించే సంక్షేమ పథకాలు ఎట్లా
అందుతాయో తెలియక తీవ్ర కష్టాల్లో ఉన్నామని కుటుంబ సభ్యులు తెలుపుతూ సహరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.\
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Another heart pounding in the gulf guppet

Leave A Reply

Your email address will not be published.