Natyam ad

పట్టాలెక్కిన మరో హై స్పీడ్ ట్రైన్

లక్నో ముచ్చట్లు:

 


ఘజియాబాద్‌లోని వసుంధర సెక్టార్‌-8లో నిర్మించిన స్టేషన్‌ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ‘నమో భారత్‌’ను జెండా ఊపి ప్రారంభించారు. శనివారం నుంచి సామాన్య ప్రజల కోసం ర్యాపిడ్ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. మొదటి దశలో ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్‌లో 17 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఈ ప్రయాణం 12 నిమిషాల్లో పూర్తవుతుంది. ఈ కారిడార్ పొడవు 82 కి.మీ. ఇందులో 14 కి.మీ ఢిల్లీలో మరియు 68 కి.మీ ఉత్తరప్రదేశ్‌లో ఉంది.పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ సౌకర్యం కలిగిన నమో భారత్ రైళ్లలో ఇరువైపులా 2×2 లేఅవుట్లో సీట్లు, నిలబడేందుకు విశాలమైన ప్రదేశం, లగేజ్ ర్యాక్లు ఉంటాయి. సీసీటీవీలు, ఎమర్జెన్సీ డోర్ ఓపెనింగ్ వ్యవస్థ, ఛార్జింగ్ పాయింట్లు వంటి అధునాతన సౌకర్యాలు కల్పించారు. ఈ రైళ్లు ఉదయం 6 నుంచి రాత్రి 11 వరకు ప్రతి 15 నిమిషాలకు ఒక సర్వీసు ఉంటుంది. ఈ రైళ్ల గరిష్ఠ వేగం 160 కి.మీ. అయినా.. అంతకంటే కొంచెం తక్కువ వేగంతోనే నడపునున్నట్టు అధికారులు వెల్లడించారు.నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) NCRలో ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) యొక్క నెట్‌వర్క్‌ను సిద్ధం చేస్తోంది, ఇది ఢిల్లీ మెట్రో యొక్క వివిధ మార్గాలతో అనుసంధానించబడుతుంది. ఇది అల్వార్, పానిపట్ మరియు మీరట్ వంటి నగరాలను ఢిల్లీకి కలుపుతుంది.

 

నా బాల్యమంతా అక్కడే గడిచింది
ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ ర్యాపిడ్ ట్రైన్‌ని ప్రారంభించారు. షహీదాబాద్-దుహాయ్ డిపోట్ మధ్య నడిచే రైలుకి పచ్చజెండా ఊపారు. దేశంలో అందుబాటులోకి వచ్చిన తొలి Regional Rapid Transit System ఇదే. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ నవరాత్రుల సందర్భంగా ఈ ర్యాపిడ్ ట్రైన్స్‌ని ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రజలకు అభినందనలు తెలిపారు. భారత్‌ నిర్దేశించుకున్న కొత్త లక్ష్యాలను చేరుకునే క్రమంలో ఇదో మైలురాయి అని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతోనే ఇలాంటి కొత్త ప్రాజెక్ట్‌లు ప్రవేశపెడుతున్నట్టు స్పష్టం చేశారు ప్రధాని మోదీ. తన బాల్యంలో ఎక్కువ సమయం రైల్వే ప్లాట్‌ఫామ్‌పైనే గడిపేవాడినని అప్పటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. “భారత్‌ ప్రతి రంగంలోనూ దూసుకుపోతోంది. భారత్‌ చంద్రుడిపైనా ల్యాండ్ అయి చరిత్ర సృష్టించింది. G20 సమావేశాలతో ఖ్యాతి మరింత పెరిగింది. ఏషియన్ గేమ్స్‌లో 100కిపై మెడల్స్‌ సాధించగలిగాం. 5G నెట్‌వర్క్‌ని కూడా అందుబాటులోకి తీసుకురాగలిగాం. ఈ క్రమంలోనే నమోభారత్‌నీ అందుబాటులోకి తీసుకొచ్చాం. నవ భారతానికి ఇదో ప్రతీక. పూర్తి దేశీయంగా తయారైన ఈ రైళ్లను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది”అత్యాధునికమైన నమో భారత్‌ రైల్లో ప్రయాణించడం ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతి అన్నారు ప్రధాని. ఇదే సమయంలో తన బాల్యాన్నీ గుర్తు చేసుకున్నారు. నవరాత్రి సందర్భంగా ఇలాంటి కార్యక్రమం చేపట్టడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. “అత్యాధునిక ట్రైన్‌ నమో భారత్‌లో ప్రయాణించాను. నాకు ఇది చాలా గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. నా బాల్యమంతా రైల్వే ప్లాట్‌ఫామ్‌పైనే గడిపేవాడిని. ఇప్పుడిదే రైల్వే నాకు గొప్ప అనుభూతిని, ఆనందాన్నిస్తోంది. నవరాత్రి వేడుకల సమయంలో ఈ ట్రైన్‌ని ప్రారంభించుకోవడం చాలా గొప్ప విషయం. ఆ కాత్యాయిని దేవి ఆశీర్వాదం మనకి ఎప్పుడూ ఉంటుంది”

 

Post Midle

Tags: Another high speed train on track

Post Midle