Natyam ad

ఖమ్మం జిల్లాలో మరో “ఇంజక్షన్ మర్డర్”..

40 రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన ఘటన..

కుటుంబ కలహాలతో రెండో భార్య నవీనకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి చంపిన భర్త భిక్షం..

ప్రసవం కోసం నవీనను ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించిన భిక్షం..

Post Midle

ప్రసవం మరుసటి రోజు ఆసుపత్రిలో నవీన మృతి..

వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయిందని భర్త, బంధువుల ఆందోళన..

రూ. 5 లక్షల పరిహారానికి డిమాండ్..

అనుమానంతో సీసీ పుటేజీని పరిశీలించిన ఆసుపత్రి యాజమాన్యం..

నవీనకు భర్త భిక్షం మత్తు ఇంజక్షన్ ఇచ్చినట్లు ఆధారాలు..

పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆసుపత్రి నిర్వాహకులు..

భిక్షాన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిన పోలీసులు.

ఖమ్మంలో కలకలం రేపుతున్న మరో సూది హత్య ఘటన

-సెలెన్ బాటిల్ లో పాయిజన్ ఇంజక్షన్ చేసి భార్యను చంపిన భర్త.

 

ఖమ్మం  ముచ్చట్లు:

నాలుగు రోజుల క్రితం ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో కలకలం రేపిన సూది మందు హత్యను మరవక ముందే మరో సూది మందు మర్డర్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.ప్రాథమిక సమాచారం ప్రకారం.. భిక్షం అనే వ్యక్తి తన రెండో భార్యను హత్య చేసేందుకు ఫన్నాగం వేసి, ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి డెలివరీ కోసం ఆమెను తీసుకెళ్లాడు. ప్లాన్ ప్రకారం సెలైన్ బాటిల్‌లో పాయిజన్ ఇంజెక్షన్ ఎక్కించడంతో కొద్ది సేపటికే ఆమె మృతి చెందింది.అయితే నేరం తన మీదికి రాకుండా మరో డ్రామాకు తెరలేపాడు.వైద్యుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని ఆందోళనకు దిగాడు.

 

అసలు ఏం జరిగిందో అర్థంకాక ఆస్పత్రి యజమాన్యం సీసీ ఫుటేజీని పరిశీలించింది.దాంతో భర్త కుట్ర బాగోతం బయటపడింది. వెంటనే దీనిపై డాక్టర్లు ఖమ్మం టూటౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఈ హత్యపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా,ఖమ్మం జిల్లాలో వారం రోజుల వ్యవధిలోనే రెండు సూది మందు హత్యలు జరగడంతో అసలు వీరికి ఆ డ్రగ్ ఎవరు,ఎక్కడ విక్రయిస్తున్నారని జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

 

Tags: Another “injection murder” in Khammam district..

Post Midle