Date:24/01/2021
అమరావతి ముచ్చట్లు:
పంచాయతీ ఎన్నికలపై ఏపీ హైకోర్టులో మరో పిటీషన్ దాఖలయింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ పిటీషన్ దాఖలయింది. ఆర్టికల్ 326 ప్రకారం 2019 ఓటర్ల జాబితాను అనుసరించి ఎన్నికలను నిర్వహిస్తే 3.60 లక్షల మంది యువత ఓటు హక్కును కోల్పోతారని పిటీషన్ ను దాఖలు చేశారు. హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు కావడంతో హైకోర్టు దీనిపై రేపు విచారణ చేపట్టే అవకాశముంది. ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 2019 ఓటర్ల జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. దీనిపై పిటీషన్ ను ఒక విద్యార్థి దాఖలు చేశారు.
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
Tags:Another petition in the High Court on panchayat elections