తెలంగాణ శాసనసభ రద్దు ఫై హైకోర్టులో మరో పిటిషన్‌

Another petition in the High Court to dissolve the Telangana Assembly

Another petition in the High Court to dissolve the Telangana Assembly

-అసెంబ్లీని రద్దు చేశాం…మీ సభ్యత్వం రద్దు అయ్యిందంటే ఎలా
–   కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు డీకే అరుణ
Date:08/10/2018
హైదరాబాద్‌ ముచ్చట్లు:
తెలంగాణ శాసనసభ రద్దును సవాల్‌ చేస్తూ హైకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. శాసనసభ రద్దు రాజ్యాంగబద్ధంగా జరగలేదని పేర్కొంటూ మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు డీకే అరుణ ఈ పిటిషన్‌ వేశారు. మంత్రిమండలి తన పరిధి దాటి వ్యవహరించిందని..ఎమ్మెల్యేలకు కూడా సమాచారం ఇవ్వలేదని, ఐదేళ్లు ఉండాల్సిన సభను రాజకీయ ప్రయోజనాల కోసం మధ్యలోనే రద్దు చేశారని ఆమె ఆరోపించారు. గవర్నర్‌ కూడా ఆగమేఘాలపై రద్దును ఆమోదించారని డీకే అరుణ విమర్శించారు. అసెంబ్లీని రద్దు చేశాం… మీ సభ్యత్వం రద్దు అయ్యిందంటే ఎలా ఇదిలా ఉండగా తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ను సవాల్‌ చేస్తూ మరో పిటిషన్‌ దాఖలైంది. అత్యవసర వ్యాజ్యంగా విచారణ చేపట్టాలని పిటిషనర్‌ న్యాయస్థానాన్ని కోరారు. మధ్యాహ్న భోజన విరామం అనంతరం దీనిపై విచారణ జరిగే అవకాశముంది.
Tags: Another petition in the High Court to dissolve the Telangana Assembly

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed