– మండలంలో 3కు చేరిన పాజిటివ్ కేసులు
Date:29/06/2020
రామసముద్రం ముచ్చట్లు
రామసముద్రంలో కరోనా కేసుల సంఖ్య సోమవారం నాటికి మూడుకు చేరాయి. గతం లో ఓ లారీ డ్రైవర్ కు ఆ తర్వాత మరో బార్బర్ కు కరోనా రాగా…. తాజాగా రామసముద్రం మండలం కాప్పల్లి గ్రామానికి చెందిన 26 ఏళ్ల యువతికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు.ఈ యువతి ఇటీవల కాలంలో హైదరాబాద్ నుండి వచ్చినట్లు తెలిపారు. పాజిటివ్ వచ్చిన యువతిని చిత్తూర్ కోవిడ్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. సోమవారం యువతి కుటుంబ సభ్యులతో పాటు మరో 20 మంది నాజల్ శ్వాబ్ నమూనాలు సేకరించి పరీక్షలు నిమిత్తం ల్యాబ్ కు పంపడం జరిగిందని తెలిపారు.అలాగే వారితో పాటు ప్రైమరీ కాంటాక్ట్ వ్యక్తులను గుర్తించే పనిలో వైద్యసిబ్బంది నిమగ్నమయ్యారు. దీంతో కాప్పల్లి గ్రామంతో పాటు బైరాజుపల్లి, మట్లవారిపల్లి ప్రజలు భయం గుప్పుట్లో బిక్కుబిక్కుమంటున్నారు.
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు కరోనా పరీక్షలు
Tags: Another positive case registered in Ramasamudram zone …