Natyam ad

మరో ప్రేమోన్మాది దాడి

అనంతపురం ముచ్చట్లు:


ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది.తన ప్రేమను నిరాకరించిందని అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో ఓ ప్రేమోన్మాది కిరాతకానికి పాల్పడ్డాడు.భాస్కర్‌ అనే యువకుడు కొంతకాలంగా మైథిలి అనే యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అయితే వరుసకు అన్న కావడంతో భాస్కర్‌ ప్రేమను యువతి నిరాకరించింది. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో స్కూటీపై వెళుతున్న మైథిలిని కారుతో ఢీకొట్టాడు భాస్కర్‌. ఈ ప్రమాదంలో యువతి మైథిలికి తీవ్ర గాయాలవ్వగా అసుపత్రికి తరలించారు. నిందితుడు భాస్కర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Tags: Another romantic attack

Post Midle
Post Midle