ఆసిఫాబాద్ ముచ్చట్లు:
నాన్నా.. నన్ను కాపాడు అంటూ తండ్రి చేతిలో ప్రాణాలు వదిలిన కూతురు.అనారోగ్యంతో గురుకుల పాఠశాలలో మరో విద్యార్దిని మృతి.ఆసిఫాబాద్ – గుండాయిపేటకు చెందిన పూజ(16) సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో టెన్త్ చదువుతోంది. వారం క్రితం తండ్రికి ఫోన్ చేసి జ్వరమొచ్చింది ఇంటికి తీసుకుపో అని చెప్పింది.తండ్రి చాలా ఆస్పత్రులకు తీసుకెళ్లిన తగ్గకపోవడంతో, నిన్న హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా నాన్నా.. నన్ను కాపాడు అంటూ తండ్రి చేయి పట్టుకుని వేడుకుంది.అలా వేడుకున్న కాసేపటికే ప్రాణాలు వదలడంతో తండ్రి గుండెలవిసేలా రోదించాడు.గురుకుల పాఠశాలలో, హాస్టల్లలో జరిగే సంఘటనలు చూస్తుంటే గుండె బరువెక్కుతుంది.
Tags: Another student of Gurukula School died due to illness