హోదా కోసం మరో ఆత్మహత్య

Date:18/09/2018
కర్నూలు ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాలేదని మరో ఆత్మహత్య నమోదయింది.  కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గంలో పదవ తరగతి విద్యార్ధి మహేందర్ (14) ఆత్మహత్య చేసుకోవదం  తీవ్ర కలకలం రేపింది. తన అన్నకు ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో మహేందర్  ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  మహేందర్ తన సూసైడ్ లేఖ రాస్తూ, ప్రత్యేక హోదా వచ్చుంటే, తన అన్నకు ఉద్యోగం వచ్చుండేదని పేర్కోన్నాడు.
హోదా రాని కారణంగానే, తన అన్న నిరుద్యోగిగా ఉన్నాడని రాసుకున్నాడు. ఆర్ధిక సమస్యలతో  కుటుంబం గడవటం కష్టమైందని, ఇంట్లో వారికి భారం కాకూడదని నిర్ణయించుకున్నానని తన ఆవేదనను రాసుకోచ్చాడు. మహేందర్ మృతదేహానికి ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఎమ్మెల్యే కోట్ల సూజాతమ్మ  నివాళులర్పించారు.
మహేందర్  కుటుంబ సభ్యులను రఘువీరా ఓదార్చారు.సుజాతమ్మ విద్యార్థి కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సహాయం అందజేశారు.రఘువీరా మాట్గాడుతూ ఏపీకి హోదా అమలు చేయని మోదీ ప్రభుత్వ ద్రోహమే మహేందర్ ఆత్మహత్య కు కారణమని అన్నారు. హోదాను పోరాడి సాధించుకుందాం కానీ ఆత్మహత్యలు చేసుకోవద్దని రఘువీరా విజ్ఞప్తి చేసారు.
Tags:Another suicide for designation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *